బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి - న్యాయమూర్తి జి. భానుమతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి జి. భానుమతి అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలోని కూలి లైన్ గవర్నమెంట్ హైస్కూల్‌లో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి జి. భానుమతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలం చాలా విలువైనదని, విద్యార్థినులు పట్టుదల, సమయస్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రతిరోజు ఒక గంట సేపు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని, తద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, సిడబ్ల్యూసి మెంబర్ న్యాయవాది ఎండి సాధిక్ పాషా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Post a Comment