భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ కు కృషి చేస్తా - మంత్రి పొంగులేటి

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ కు కృషి చేస్తా - మంత్రి పొంగులేటి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  కొత్తగూడెం జిల్లాలోని రామవరం ప్రాంతంలో ఏర్పోర్ట్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 

శుక్రవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా సుజాత్ నగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామం నుండి బృందావనం వరకు మూడు కిలోమీటర్ల పొడవునా 2 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు.


అనంతరం కొత్తగూడెం లోని శ్రీ రామచంద్ర కళాశాలలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో మంత్రి పొంగులేటి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ‘‘ప్రతి సంవత్సరం జనవరి మూడో తారీఖున సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది’’ అన్నారు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ చొరవతో ‘‘ఈ ఏరు పండగ’’ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పండగ జనవరి 9న ప్రారంభం కానుంది. గోదావరి నది పరివాహక ప్రాంతం, భద్రాచల ఆలయం, కనకగిరి శిఖరం, కిన్నెరసాని డ్యామ్, భద్రాచల ఆలయం వంటి పర్యాటక ప్రదేశాలను ప్రదర్శించేందుకు ఈ పండగను ప్రత్యేకంగా రూపొందించామని చెప్పారు.


పాల్వంచ మండలం రెడ్డిగూడెం గ్రామంలో 1 కోటి 70 లక్షల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జి శంకుస్థాపన చేయబడింది. అలాగే, పాండురంగాపురం బ్రిడ్జి వద్ద 10 కోట్ల రూపాయలతో నిర్మాణం ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ మరియు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.