ఐ.ఎల్.పి.ఏ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన జిల్లా జడ్జి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కోర్టులో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.పి.ఏ) క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పాటిల్ వసంత్ హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ, “స్వేచ్ఛ, సమానత్వం, న్యాయబద్ధతను ప్రజల్లో చైతన్యం చేయడంలో ఐఎల్పీఏ అగ్రగామిగా ఉంది. రాజ్యాంగ పరిరక్షణకు ఈ సంస్థ స్ఫూర్తిదాయకంగా పనిచేస్తోంది. సమాజంలో అన్ని వర్గాల మనుషులు సమాన హక్కులు పొందాలన్న లక్ష్యంతో ఐఎల్పీఏ నిరంతరం ముందుకు సాగుతోంది” అని అభినందించారు.
సన్మాన కార్యక్రమం:
జిల్లా సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సిహెచ్. శారద (సింగరేణి కాలనీ ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్), కే సావిత్రి (ఫిజికల్ డైరెక్టర్), పాతూరి దుర్గా రాణి (ఎస్.జె.టి. నంద తండా), కె. లక్ష్మి (స్కూల్ అసిస్టెంట్, రుద్రంపూర్), టీచర్ ఇంతియాజ్ బేగం మరియు జీపూర్ణ ఎస్జీటీ (రామకృష్ణాపురం)లను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ భానుమతి, న్యాయమూర్తులు రామారావు, సాయి శ్రీ హాజరయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఐ.ఎల్.పి.ఏ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Post a Comment