పారా లీగల్ వాలంటీర్ల శిక్షణ తరగతులు ప్రారంభించిన జిల్లా జడ్జి

పారా లీగల్ వాలంటీర్ల శిక్షణ తరగతులు ప్రారంభించిన

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం జిల్లాలో నూతనంగా నియామకమైన పారా లీగల్ వాలంటరీస్‌కు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ తరగతులు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ పాటిల్ వసంత్ ప్రారంభించారు.


ఈ సందర్భంగా న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ, పారా లీగల్ వాలంటరీలు న్యాయ సేవలలో ఒక ముఖ్యమైన భాగస్వామ్యం వహిస్తూ, సామాజిక బాధ్యతను స్వీకరించి నిరక్షరాస్యులు, నిరుపేదలకు న్యాయ సేవలను చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. న్యాయానికి దూరమైన గ్రామీణులు, పట్టణ ప్రజానీకం న్యాయంపై చైతన్యాన్ని పొందేలా చైతన్య సదస్సులు నిర్వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పిలుపునిచ్చారు.


అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గొల్లపూడి భానుమతి ఆధ్వర్యంలో పారా లీగల్ వాలంటరీలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీని సత్యనారాయణ, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ వి. పురుషోత్తమరావు, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ నిరంజన్ రావు, లీగల్ కౌన్సిలర్లు నాగ స్రవంతి, జ్యోతి విశ్వకర్మ, సిడిపిఓ హరి కుమారి, న్యాయవాదులు మారపాక రమేష్ పాల్గొన్నారు.


Blogger ఆధారితం.