చీకటి కార్తీక్‌ను అభినందించిన డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల
ఈ సందర్భంగా చీకటి కార్తీక్‌ను కొత్వాల అభినందించారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి తన గృహానికి వచ్చి, తనను కలిసిన కార్తీక్‌ను కొత్వాల అభినందించారు. ఆయనతో పాటు నియోజకవర్గ స్థాయి, మండల, పట్టణ స్థాయిల్లో ఎన్నికైన నాయకులకు కొత్వాల శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గులాం మతిన్, కుంచం వెంకటేష్, తాటి పవన్, పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు ఉండేటి శాంతివర్ధన్, జక్కుల రాము, నగేష్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment