జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు మరియు సిబ్బందికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షించారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల వెనక ఎంతో మంది పోరాటయోధుల త్యాగం దాగి ఉన్నదని గుర్తు చేశారు. మన వంతు బాధ్యతగా దేశసేవ కోసం పాటుపడాలని, పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి పోలీస్ వ్యవస్థకు మంచి పేరు, ప్రతిష్ఠలు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ ఐపీఎస్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, శ్రీనివాస్, జిల్లా కార్యాలయ ఏఓ మంజ్యా నాయక్, ఆర్ఐలు, సీఐలు, ఎస్సైలు, జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.