విద్యుత్ ఉత్పత్తి పెంచడంలో కార్మికులు సమిష్టిగా కృషి చేయాలి - కేటీపీఎస్ ఏడవ దశ సీఈ

విద్యుత్ ఉత్పత్తి పెంచడంలో కార్మికులు సమిష్టిగా కృషి చేయాలి - కేటీపీఎస్ ఏడవ దశ సీఈ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  విద్యుత్ ఉత్పత్తి పెంచడంలో కార్మికులు ముఖ్య భూమిక పోషించాలని కేటీపీఎస్ ఏడవ దశ చీఫ్ ఇంజనీర్ పాలకుర్తి వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-142) ఆధ్వర్యంలో రూపొందించిన 2025 సంవత్సరం విద్యుత్ కార్మిక డైరీ, క్యాలెండర్‌ను కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ పి.వెంకటేశ్వరరావు తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమంలో హెచ్-142 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కెవి రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. వెంకట్ రెడ్డి, నాయకులు ఎస్. శ్రీనివాసాచారి, డి. సత్యరాజ్, స్టీవెన్, వెంపటి వెంకటేశ్వర్లు, షేక్ సయ్యద్, పబ్బు శ్రీహరి, ఎస్. నాగభూషణం, టి. కోటేశ్వరరావు, ఎం. శివరాం, ఉపేందర్, లక్పతి, రాములు, బాబురావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.