విద్యార్థిని దీప్తి వర్షితను అభినందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

విద్యార్థిని దీప్తి వర్షితను అభినందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం జిల్లాలో ఇటీవల ఇంగ్లీషు లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా), తెలంగాణా ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి సంయుక్తంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఇంగ్లీషు ఒలింపియాడ్, వక్తృత్వ పోటీలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాబూ క్యాంప్‌ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని దీప్తి వర్షిత వక్తృత్వ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది.


ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ బుధవారం జిల్లా కోర్టులోని తన ఛాంబర్‌లో దీప్తి వర్షితను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో ఈ నెల 31న పాల్గొనబోతున్న దీప్తి, అక్కడ కూడా ప్రతిభ చాటాలని, జిల్లా పేరును, తన పాఠశాల ఖ్యాతిని నిలబెట్టాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో న్యాయమూర్తిలు జి. భానుమతి, బి. రామారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, అడ్వకేట్ రాజమల్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీరజ, ఇంగ్లీషు టీచర్లు షేక్ దస్తగిరి, చందర్ రావు, జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.