పాల్వంచలో విశ్వబ్రాహ్మణ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ

పాల్వంచలో విశ్వబ్రాహ్మణ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : 
పాల్వంచ తహసిల్దార్ కార్యాలయంలో బుదవారం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం మాతృ సంఘం క్యాలెండర్లను పాల్వంచ తహసిల్దార్ వివేక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా తహసిల్దార్  వివేక్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనాలని, సమాజంలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు తమ కృషి ద్వారా జాతి సమగ్రతకు దోహదపడాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్షుడు కాపర్తి వెంకటాచారి, కార్యదర్శి వారాధి సత్యనారాయణ, మొగులోజు సీతారామాచారి, కాసర్ల రామారావు, బ్రహ్మంగారి గుడి ఆలయ నూతన కమిటీ అధ్యక్షుడు నాంపల్లి వేణుగోపాలచారి, కార్యదర్శి మోతుకూరి రవి, కోశాధికారి జుజ్జురి ప్రభాకరాచారి, బసవపాత్రుని తిరుపతి, అక్కినపల్లి వెంకటేశ్వర్లు, మమిళ్లపల్లి వెంకటాచారి, సీపీఐ పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబా, మస్నా శ్రీనివాస్ రావు, చేకూరి శేఖర్ బాబు, గోపాల్, అద్దంకి జోగేశ్వరచారి తదితరులు పాల్గొన్నారు.




Blogger ఆధారితం.