క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి - సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : గెలుపు, ఓటములను క్రీడాకారులు సమానంగా తీసుకొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్. కె. సాబీర్ పాషా క్రీడాకారులకు సూచించారు.
పాల్వంచ మండలం కిన్నెరసాని కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల గ్రౌండ్‌లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ నాలుగు రోజులు పాటు నిర్వహించారు. పోటీల్లో మండలం నుండి 20 జట్లు పాల్గొనగా హోరాహోరి జరిగిన మ్యాచ్‌లో కిన్నెరసాని జగన్నాధపురం ఫైనల్ మ్యాచ్ ఆడగా, జగన్నాధపురం జట్టు గెలుపొందింది.
ఈ సందర్భంగా శుక్రవారం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్. కె. సాబీర్ పాషా ఫస్ట్ ప్రైజ్ జగన్నాధపురం జట్టుకు, సెకండ్ ప్రైజ్ కిన్నెరసాని జట్టుకు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సమావేశంలో సాబీర్ పాషా మాట్లాడుతూ కొమరం భీమ్ యువతను అభినందించారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు. భద్రాద్రి జిల్లాలో క్రీడాకారులకు కొదువలేదని, వారికి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబర్చి జిల్లాకు వన్నె తెచ్చేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, సిపిఐ పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబు, సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, సిపిఐ మండల నాయకులు నిమ్మల రాంబాబు, కొంగర అప్పారావు, ఎస్. కె. కాసిం, విజయ్ కుమార్, కొమరం భీమ్ యువత సభ్యులు వజ్జా రామకృష్ణ, వజ్జా విక్రాంత్, తాటి సురేష్, ఆరీఫ్, బొర్ర ఉదయ్, రాంబాబు, అప్పారావు, శెట్టిపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

.webp)
Post a Comment