అనాధ శరణాలయాలను తనిఖీ చేసిన న్యాయమూర్తి జి. భానుమతి

అనాధ శరణాలయాలను తనిఖీ చేసిన న్యాయమూర్తి జి. భానుమతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ - హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి కొత్తగూడెంలోని శ్రీ స్నేహలత సంధ్యలత పిల్లల, వృద్ధాశ్రమం, శ్రీ జ్యోతి అనాధ వృద్ధాశ్రమం, శ్రీ సత్యసాయి అనాధ వృద్ధాశ్రమాలను సందర్శించి వారికి కల్పిస్తున్న కనీస సౌకర్యాల గురించి ఆరా తీశారు.


ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆశ్రమ నిర్వాహకులకు తగు సూచనలు ఇస్తూ సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ఆశ్రమాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. న్యాయ సంబంధమైన సమస్యలు ఏమైనా ఉంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీకి దరఖాస్తు చేయడం ద్వారా ఉచితంగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.