జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విస్తృత పర్యటన
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ దమ్మపేట, ములకలపల్లి మండలంలో గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా దమ్మపేట మండలం పూసుకుంట, కటుకూరు గ్రామాల కొండరెడ్ల ఆవాసాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొండరెడ్ల జీవన విధానం, వారి అభివృద్ధి కోసం చేపట్టవలసిన పనులను గిరిజనులతో మాట్లాడి తెలుసుకున్నారు. కొండరెడ్ల అభివృద్ధికి, వారి జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను పరిశీలించారు.
అనంతరం ములకలపల్లి మండలం మంగపేట ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన పి.హెచ్.సీలో అందుబాటులో ఉన్న మందుల వివరాలను అక్కడున్న వైద్యులు మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పి.హెచ్.సీలో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించేందుకు వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్యం అందించాలని ఆదేశించారు. పిల్లలకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం పూర్తయ్యే విధంగా చూడాలని, మాతా శిశు సంరక్షణ చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ములకలపల్లి మండలం రామానుజయపురంలో ఉన్న ఇటుకల తయారీ కేంద్రాన్ని మరియు నర్సరీని కలెక్టర్ సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment