రేణుక చౌదరిని కలిసిన బద్ది కిషోర్

రేణుక చౌదరిని కలిసిన బద్ది కిషోర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  రాజ్యసభ ఎంపీ రేణుక చౌదరిని కాంగ్రెస్ పార్టీ ఎల్.డి.ఎం కోఆర్డినేటర్ బద్దికిషోర్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ కేటీపీఎస్ 8వదశ నిర్మాణానికి కృషి చేయాలని, గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన కేటీపీఎస్ 5,6 దశల నిర్మాణంలో పనిచేసి,  ఐడీ నంబర్ ఉన్న కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. కేటీపీఎస్ ను సందర్శించి స్థానికంగా ప్రజల సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయన రేణుక చౌదరికి విజ్ఞప్తి చేశారు.


Blogger ఆధారితం.