జర్నలిస్ట్ వీరన్న కు ఘన సన్మానం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జర్నలిస్ట్ వీరన్న ను నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆదివారం నేతాజీ యువజన అధ్యక్షుడు ఎస్.జె.కె.అహ్మద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాల్వంచ పట్టణ పరిధి వనమా కాలనీలోని నేతాజీ యువజన సంఘం కార్యాలయంలో జనతా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఏవి రాఘవ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జర్నలిజం రంగంలో విశిష్ట సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ జి.వీరన్నను ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్.జె.కె.అహ్మద్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించుటకు త్యాగాలు చేసి ,అమరులైన జాతీయోద్యమ నాయకుల త్యాగనిరతిని గుర్తుచేసుకున్నారు. నేటి యువత దేశ చరిత్ర, మహనీయుల త్యాగాలు తెలుసుకోవాలన్నారు. చరిత్ర తెలిసిన యువతే దృఢమైన సమాజాన్ని నిర్మించగలరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు సయ్యద్ అక్బర్, ఎం సంతోష్, జె.స్టాలిన్, కొప్పుల సీతారాములు, చిమ్మినాయుడు, వనమా కాలనీ గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment