పాల్వంచలో 100 మీటర్ల జాతీయ పతాకంతో AIM LEAD స్కూల్ విద్యార్దుల ర్యాలీ

పాల్వంచలో 100 మీటర్ల జాతీయ పతాకంతో AIM LEAD స్కూల్ విద్యార్దుల ర్యాలీ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  పాల్వంచ పట్టణంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని AIM LEAD స్కూల్ ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుండి శాస్త్రి రోడ్ మార్కెట్, కిన్నెరసాని రోడ్డు మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీ ఆకర్షణీయంగా నిలిచింది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నాగభూషణం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ర్యాలీ అనంతరం పాఠశాల ఆవరణలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

కార్యక్రమంలో నాగభూషణం మాట్లాడుతూ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, అంబేద్కర్ చేసిన సేవలను వివరించారు.విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన క్రీడల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జాతీయ నాయకుల వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విజేతలను అభినందించారు. 

Blogger ఆధారితం.