మణుగూరు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : మణుగూరు పోలీసుల ఆధ్వర్యంలో మణుగూరు పట్టణంలోని అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని అనుసంధానం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శనివారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు పట్టణ వ్యాప్తంగా 92 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటన్నింటినీ అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఈ కెమెరాలలో వాహనాల నెంబర్లను క్యాప్చర్ చేసే కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేరాలను నిరోధించడంలో, ఛేదించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని అన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘాను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
వ్యాపార సముదాయాలు, గృహ యజమానులు, పరిశ్రమలు, ఇతర సంస్థల వారు వారి ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని నేరాలను అదుపు చేయడంలో తమ వంతు కృషి చేయాలని సూచించారు. పోలీస్ శాఖ నేరాలను అదుపు చేయడం కోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించడంలో తెలంగాణ పోలీస్ శాఖ మొదటి స్థానంలో ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, ఎస్సై ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment