లూయి బ్రెయిలీ సేవలు చిరస్మరణీయం - స్వర్ణలత లెనీనా

లూయి బ్రెయిలీ సేవలు చిరస్మరణ్యం - స్వర్ణలత లెనీనా

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  లూయి బ్రెయిలీ సేవలు చిరస్మరణీయం అని జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా అన్నారు. మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లూయి బ్రెయిలీ 216వ జయంతి వేడుకలను శనివారం స్థానిక జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లూయి బ్రెయిలీని స్మరించుకుంటూ, ఆయన అంధుల కోసం అందించిన సేవలను కొనియాడారు. ముఖ్యంగా అంధుల కోసం బ్రెయిలీ లిపిని కనుగొని ఆయన ఆదర్శంగా నిలిచారని, ఆయన చేసిన సేవలకు గాను లూయి బ్రెయిలీ పుట్టిన రోజును బ్రెయిలీ డేగా జరుపుకుంటున్నామని అన్నారు. అనంతరం, అంధులతో కలిసి కేక్ కట్ చేశారు.


ఈ కార్యక్రమంలో బ్లైండ్ అసోసియేషన్ సభ్యులు నరేందర్, బాలకృష్ణ, రమణయ్య, కిరణ్, ఉపేంద్ర, బిందు, ఇతర అంధులు, జిల్లా సంక్షేమ కార్యాలయ సిబ్బంది, సఖి స్టాఫ్, హబ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.