డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాజువాలిటీలో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. శనివారం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పురోగతిలో ఉన్న పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఆసుపత్రిలో ఇప్పటికే ఐదు డయాలసిస్ యూనిట్లు ఉన్నాయని, అదనంగా ఆసుపత్రికి కేటాయించిన ఐదు డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ వార్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న డయాలసిస్ వార్డులో తగినంత ప్రదేశం లేనందున క్యాజువాలిటీలో డయాలసిస్ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. క్యాజువాలిటీలో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ఆ రూమ్‌లో డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అధికారులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ రమేష్, ఆర్ అండ్ బి అధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment