ఐటీడీఏ పీవో రాహుల్ ఐఏఎస్‌కు స్పెషల్ అవార్డు

ఐటీడీఏ పీవో రాహుల్ ఐఏఎస్‌కు స్పెషల్ అవార్డు


జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  భద్రాచలం  ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఐఏఎస్ స్పెషల్ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన 15వ నేషనల్ ఓటర్ల దినోత్సవ వేడుకలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా పీవో రాహుల్ అవార్డును స్వీకరించారు.


2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో బెల్లంపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా బి. రాహుల్ ఐఏఎస్ విజయవంతంగా నిర్వహించిన విధులకు గాను ఈ ప్రత్యేక అవార్డును గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు.


రాష్ట్ర గవర్నర్ నుంచి ప్రత్యేక అవార్డును అందుకున్న భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఐఏఎస్‌కు ఐటిడిఏ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Blogger ఆధారితం.