విజయోత్సవ ర్యాలీకి ఎమ్మెల్యేను ఆహ్వానించిన చీకటి కార్తీక్

విజయోత్సవ ర్యాలీకి ఎమ్మెల్యేను ఆహ్వానించిన చీకటి కార్తీక్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ మంగళవారం కలిశారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఈనెల 12న పాల్వంచ పెద్దమ్మతల్లి గుడి నుండి కొత్తగూడెం విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ వరకు చేపట్టనున్న విజయోత్సవ ర్యాలీకి హాజరవ్వాలని ఎమ్మెల్యే ఆదినారాయణను చీకటి కార్తీక్ ఆహ్వానించారు.


ఈ సందర్భంగా చీకటి కార్తీక్‌ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి కార్తీక్ వెంట గులామ్ మతిన్, కుంచం వెంకటేష్, మద్దెల జయసూర్య, పల్లి ప్రణయ్, తాటి పవన్, స్థానిక నాయకులు జూపల్లి రమేష్ ఉన్నారు.


Blogger ఆధారితం.