మహనీయుల స్ఫూర్తితో సేవలందించాలి - డి.ఏం అండ్ హెచ్.ఓ

మహనీయుల స్ఫూర్తితో సేవలందించాలి - డి.ఏం అండ్ హెచ్.ఓ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరికీ వైద్య సేవలందించాలని డి.ఏం అండ్ హెచ్.ఓ డాక్టర్ ఎల్. భాస్కర్ సిబ్బందిని కోరారు.

గురువారం అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్వతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రెండు నిమిషాల మౌనం పాటించారు.

ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరికీ వైద్య, ఆరోగ్య సేవలను అందించాలని, నిర్దేశించిన లక్ష్యాలను సాధించి దేశ పురోగతిలో తమ వంతు పాత్ర నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఏం అండ్ హెచ్.ఓ డాక్టర్ సుకృత, డాక్టర్ బాలాజీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.