కన్నుల పండుగగా నవభారత్ స్కూల్ వార్షికోత్సవం
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఎం.జి.ఎం. ప్రసాద్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ప్రిన్సిపల్ ఎం.వి. శ్రీనివాస్ రెడ్డి పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు. అనంతరం ముఖ్య అతిథి మాట్లాడుతూ భద్రాచలం రాముడి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్న ఈ పాఠశాల ఈ జిల్లాకే పరిమితం కాకుండా, విద్యార్థుల ప్రతిభను జాతీయస్థాయికి పరిచయం చేసిందని ప్రశంసించారు. ముఖ్యంగా, విద్యార్థి వయసులో విద్యతో పాటు నైతిక విలువలు, స్వీయ క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని తెలిపారు.విద్యార్థి దశలోనే ఆలోచనలను, ప్రణాళికలను సంసిద్ధం చేసుకోవాలని, దీనికి తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో అవసరమని సూచించారు.
తదుపరి చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భూమాత ధరావాహిక, దేశభక్తి నృత్యం, సీనియర్ బాలికల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. బోర్డు పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నవభారత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. జ్యోతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఎ. శ్రీదేవి సమన్వయకర్తగా వ్యవహరించారు.

Post a Comment