హత్య కేసులో వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :హత్య కేసులో వ్యక్తికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు చెప్పారు.
కేసు వివరాల ఇలా..2022 ఫిబ్రవరి 7 న మధ్యాహ్నం షేక్ యాకూబ్ పాషా తన తల్లి షేక్ ఫాతిమాతో గొడవపడి, ఆమెను బూతులు తిడుతూ, ముఖం మీద దెబ్బలు కొట్టాడు. ఆ సమయంలో యాకూబ్ పాషాను నెట్టివేసిన తల్లి కిందపడింది. ఆ తర్వాత, యాకూబ్ పాషా యొక్క మేనమామ షేక్ లతీఫ్ ఆ ఘర్షణను విడదీయడానికి వచ్చాడు. ఈ క్రమంలో పాషా తన తల్లిని ఆవేశంలో నెట్టివేగా కిందపడి దెబ్బ తగిలింది అంతలో అతని మేనమామ లతీఫ్‌ను అతని కూతురు రజియాలు వచ్చి ఎందుకు కొడుతున్నావ్ అంటూ అడగగా మేనమామ లతీఫ్ ను పాష పెద్ద బండరాయితో ఛాతిపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం, గాయపడిన లతీఫ్‌ను కొత్తగూడెం సంజీవని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతున్నప్పుడే లతీఫ్ మృతిచెందాడు.
ఈ ఘటనపై లతీఫ్ భార్య బీజాన్ బి ఫిర్యాదు చేయడంతో, సుజాతనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దర్యాప్తు అనంతరం, సర్కిల్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ కోర్టుకు చార్జి షీటు దాఖలు చేశారు. కోర్టులో పదిమంది సాక్షులను విచారించిన తర్వాత, న్యాయమూర్తి యాకూబ్ పాషా పై 302 ఐపీసీ కింద ఉన్న హత్య అభియోగాన్ని 304(II) ఐపీసీ కింద మార్చి, అతనికి మూడు సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు 500 రూపాయల జరిమానా విధించారు.
ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ రాధాకృష్ణమూర్తి, పివిడి లక్ష్మిలు వాదించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై జి.ప్రవీన్, కోర్టు లైజాన్ ఆఫీసర్ వీరబాబు మరియు (కోర్టు డ్యూటీ ఆఫీసర్ ) హెచ్.సి.ఎన్. వెంకటేశ్వర్ రావు సహకరించారు.

Post a Comment