పెద్దమ్మతల్లి గుడిలో టెండర్లు, బహిరంగ వేలం వాయిదా

పెద్దమ్మతల్లి గుడిలో టెండర్లు, బహిరంగ వేలం వాయిదా

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానంలో శుక్రవారం నిర్వహించాల్సిన టెండర్లు, బహిరంగ వేలం వాయిదా వేస్తున్నట్లు పెద్దమ్మతల్లి గుడి కార్యనిర్వహణ అధికారి ఎన్. రజనీకుమారి ఓ ప్రకటనలో వెల్లడించారు.


దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి చెందిన కొత్త కాంప్లెక్స్‌లోని షాపు నెం. 4, షాపు నెం. 10, రెండు ఏసీ ఫంక్షన్ హాళ్లను మూడు సంవత్సరాల కాలపరిమితికి లీజు/లైసెన్స్ హక్కుల కోసం సీల్డ్ టెండర్లు-కం-బహిరంగ వేలం నిర్వహించాల్సి ఉండేది. అలాగే, దేవస్థానం తరఫున ప్రోగుచేసిన చీరల అమ్మకం, పాత కాంప్లెక్స్‌లోని షాపు నెం. 1 బొమ్మలు, బల్లలు, ఇతర వస్తువుల అమ్మకానికి కూడా టెండర్-వేలం చేపట్టాలని నిర్ణయించారు.


అయితే, ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి ఎవరూ రాకపోవడంతో టెండర్లు, బహిరంగ వేలాన్ని వాయిదా వేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్. రజనీకుమారి తెలిపారు.

Blogger ఆధారితం.