ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి - ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ పట్టణంలో ఫిబ్రవరి 5, 6 తేదీల్లో జరగనున్న ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 4వ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి. వీరభద్రం పిలుపునిచ్చారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బి. వీరభద్రం విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ అలుపెరుగని పోరాటాలు చేస్తుందని, పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలతో పాటు మెస్, కాస్మోటిక్స్ చార్జీల పెంపు, మౌళిక సదుపాయాల కల్పన, ఖాళీ పోస్టుల భర్తీ, వసతి గృహాల నిర్మాణం వంటి కీలక అంశాలపై పోరాటాలు నిర్వహించామని ఆయన తెలిపారు.
మహాసభల్లో విద్యారంగ అభివృద్ధి కోసం పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. 23 మండలాల నుంచి 250 మంది ప్రతినిధులు పాల్గొంటారని, విద్యారంగ శ్రేయోభిలాషులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ సూచనలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సిహెచ్. రామ్ చరణ్, బి. సాయి, నవీన్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment