ఆటలతో శరీర దృఢత్వం పెరుగుతుంది - జిల్లా జడ్జి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఆటలతో శరీర దృఢత్వం పెరుగుతుందని, పని భారం వల్ల ఆటలు, పాటలకు దూరమైన పరిస్థితుల్లోంచి బయటపడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డేను పురస్కరించుకొని కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా రామవరం సాధన గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్ జరిగింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, శారీరక మరియు మానసిక పునరుత్తేజానికి వీలు కల్పించే మానసిక ఉల్లాసం ఆటల వల్ల పొందవచ్చని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ, క్రీడల వల్ల అందరికీ నూతన ఉత్తేజం కలుగుతుందని, కోర్టు కుటుంబంలోని సభ్యులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా పరస్పర స్నేహం పెంపొందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కే. శిరీష, వి. శివానాయక్, న్యాయవాదులు పలివెల సాంబశివరావు, పోసాని రాధాకృష్ణమూర్తి, అణుబ్రోలు రాంప్రసాదరావు, గాజుల రామమూర్తి, పాతూరి పాండురంగ విటల్, అరకాల రవికుమార్, వి. రామకృష్ణ, నాగరాజు, పప్పుల ప్రసాద్, దొడ్డ ప్రసాద్, మెండు రాజమల్లు, ఉప్పు అరుణ్, గడిపల్లి మహేశ్వరరావు, యు. సునీల్, కాసాని రమేష్, ఎం.డి. సాదిక్ పాషా, దొడ్డ సమంత్, సంకుబాపన అనుదీప్, వేముల మధుకర్, రావిలాల రామారావు, కార్తీక్, దేవదాస్, ఎస్. రామారావు, జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామిశెట్టి రమేష్, లగడపాటి సురేష్, దీకొండ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment