కులమతాలకతీతంగా జరిపే పండుగ సంక్రాంతి - కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కులమతాలకతీతంగా జరిపే పండుగ సంక్రాంతి అని డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పాత పాల్వంచలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఇంటివద్ద సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు ఎం.డి. మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో కొత్వాలను సన్మానించి, శుభాకాంక్షలు తెలుపుతూ మత సామరస్యాన్ని చాటారు.
అనంతరం కొత్వాల మాట్లాడుతూ మైనారిటీ నాయకులు మతాలకతీతంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, వేడుకల్లో పాల్గొనడం మత సామరస్యాన్ని చాటుతుందన్నారు. సంక్రాంతి పండుగ ప్రజలందరినీ భోగభాగ్యాలతో, కొత్త వెలుగులు నింపాలని కోరారు.
ఈ కార్యక్రమాల్లో ముస్లిం మైనారిటీ నాయకులు అఖీమ్ ఖురేషి, నాయక్ ఖురేషి, అబ్దుల్ నబీ, సాజిత్, కుక్కల రవి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment