దండోరా శ్రీనుకు ప్రతిష్టాత్మకమైన అవార్డు.. వివిధ సంఘాల నాయకుల ప్రశంసలు
ఈ సందర్భంగా గురువారం దండోర శ్రీను పాల్వంచ ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసారు.
ప్రెస్ మీట్ లో దండోర శ్రీను మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన హైదరాబాద్ లోని సుదరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య అకాడమి 8వ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్‌లో సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నట్లుగా తెలిపారు.
ఇందులో భాగంగా తాను చేస్తున్న సంఘ సేవ కార్యక్రమాలను గుర్తించి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నేషనల్ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కాన్ఫరెన్స్‌లో తెలంగాణాలోని 31 జిల్లాల నుండి 300 మంది డెలిగేట్లు పాల్గొన్నారని తెలిపారు. అవార్డు ప్రధానోత్సవంలో బిఎస్ఎ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎం. గౌతమ్, కమిటీ సభ్యులు చింతూరు మల్లయ్య, తదితరులు పాల్గొన్నారని తెలిపారు.
అవార్డు ఎంపిక పట్ల దండోర శ్రీనును పాల్వంచ పట్టణంలోని వివిధ కుల సంఘాల నాయకులు కాల్వ భాస్కరరావు, కొత్తపల్లి సోమయ్య, కాల్వ ప్రకాశ్ రావు, కొత్తపల్లి శ్రీను, గొడ్ల మోహన్ రావు , దాసరి యాకయ్య, భాషా, గుర్రం వెంకటరత్నం, ఎం. రాజేందర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రెసిడెంట్ యం.డి. మంజూర్ అలీ, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్, పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించారు.


Post a Comment