పోలీస్ స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడిన నిషేధిత మంజా

పోలీస్ స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడిన నిషేధిత మంజా

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :   జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం పట్టణంలో నిషేధిత చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారంతో కొత్తగూడెంలోని చిన్న బజార్, పెద్ద బజార్ ప్రాంతాలలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు గురువారం కొత్తగూడెం డిఎస్పి రెహమాన్  తెలిపారు.


కొత్తగూడెం 3 టౌన్ సీఐ కె.శివ ప్రసాద్, ఎస్సైలు పురుషోత్తం, మస్తాన్ మరియు వారి సిబ్బంది చిన్న బజార్, పెద్ద బజార్ ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.


ఈ స్పెషల్ డ్రైవ్ లో పెద్ద బజార్ లోని పవన్ టాయ్స్ షాప్ నుండి 5-30 బండిల్స్ మాంజా, 10 ప్యాకెట్లు థ్రెడ్ రోల్ మరియు పవన్ జనరల్ మర్చంట్స్ నుండి 14 బండిల్స్ మాంజాను సీజ్ చేశారు.


ఈ నిషేధిత చైనా మాంజాల విలువ ₹9100/-గా అంచనా వేయబడింది. చైనా మాంజా వాడకం ప్రజల ప్రాణాలకు, వాహన దారులకు, పక్షి జాతికి ప్రమాదకరమని, అందుకే ప్రభుత్వం దీనిని నిషేధించింది. దీన్ని విక్రయిస్తే, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరించారు.

Blogger ఆధారితం.