సిఎంఆర్ కళాశాల వీడియో ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించాలి - AISF
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేడ్చల్ సివార్లో ఉన్న సి.ఎం.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో గత 3 నెలలుగా విద్యార్థినుల బాత్రూమ్‌లలో స్పై కెమెరాలు పెట్టి అస్లీల వీడియోలు తీసి, కళాశాల యాజమాన్యానికి తెలపిన వార్డెన్, విద్యార్థులను బెదిరించేందుకు ఈ వీడియోలను ఉపయోగించారన్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుండి సౌకర్యాలు, ఫీజుల అక్రమాలు ప్రశ్నిస్తే, వారిని బ్లాక్‌మెయిల్ చేసి బెదిరిస్తున్నట్లు ఆరోపించారు.
వారు మల్లారెడ్డి, అతని తమ్ముడు గోపాల్ రెడ్డి పాత్రపై కూడా విచారణ జరిపించాలని, వార్డెన్ ప్రితిరెడ్డి, మల్లారెడ్డి, గోపాల్ రెడ్డిలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. "ఈ కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అయితే పోలీసులు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఈ చర్యలు మరింత పెరిగిపోయాయి" అని ఆయన అన్నారు.
అలాగే, లక్షలాది రూపాయలు ఫీజులు పెంచి సౌకర్యాలు కల్పించకుండా, సరైన భోజనం అందించకుండా అడిగిన విద్యార్థులను బెదిరించడంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా భద్రత గురించి చర్చ జరుగుతున్న ఈ సమయంలో, వారి అంగీకారం లేకుండా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని కళాశాల గుర్తింపు రద్దు చేయాలని, విద్యార్థులు తమ చదువులు నష్టపోకుండా వేరే కళాశాలలో నిర్వహించేందుకు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజేష్, రాధా, కళ్యాణి, వైష్ణవి, వంశీ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment