సీఎం కప్ - 2024 రాష్ట్రస్థాయి క్రీడల్లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులను అభినందించిన కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ - 2024 క్రీడా పోటీలలో భాగంగా రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అథ్లెటిక్స్ క్రీడాకారులు సత్తాచాటారు. ఈ విజయాన్ని సాధించినందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వారికి అభినందనలు తెలిపారు.
ఇటీవల సీఎం కప్ - 2024లో జవహర్‌లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణం, హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారులు 86 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం అథ్లెటిక్స్ విభాగంలో 12 స్వర్ణ పతకాలు, 5 రజత పతకాలు, 11 కాంస్య పతకాలు సాధించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ విజయం సాధించి, రాష్ట్రస్థాయిలో జిల్లాకు గౌరవాన్ని తీసుకువచ్చిన క్రీడాకారులను అభినందించారు. క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డిని, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహిధర్‌ను, మహిళల ఆర్చరీ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రశంసించారు.
.webp)
Post a Comment