ఏసుక్రీస్తు బోధనలు సకల మానవాళికి మార్గదర్శకం - డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఏసుక్రీస్తు చేసిన బోధనలు ప్రపంచంలోని సకల మానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం పాల్వంచ మండల పరిధిలోని అంబేద్కర్ నగర్ ఫాస్టర్ జాన్ విల్సన్ మెర్సీ సువార్త చర్చిలో క్రైస్తవులను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చర్చి ఫాస్టర్ దయాకర్ ఆధ్వర్యంలో కొత్వాలను శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో శనగ నాగయ్య, వాడపల్లి సంజీవరావు, ప్రభాకర్, సుష్మ పాల్గొన్నారు.
RCM చర్చి ఆధ్వర్యంలో: పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస కాలనీలో గల చర్చిలో ఫాదర్ విజయరావు, సిస్టర్ మరియంల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాలను శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించారు.
CSI చర్చి ఆధ్వర్యంలో: KTPS కాలనీలోని CSI చర్చిలో ఫాదర్ సేనం రాజు ఆధ్వర్యంలో జరిగిన ప్రార్థనల్లో కొత్వాల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ "ఎన్ని కష్టాలు ఎదురైనా శాంతి మార్గంలోనే పయనించాలని క్రీస్తు బోధించారు. ప్రేమ, కరుణ, దయ వంటి గుణాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అలవర్చుకోవాలి. ఏసు ప్రభువు దీవెనలు ప్రతి ఒక్కరికి లభించాలని" కోరారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు వై. వెంకటేశ్వర్లు, పైడిపల్లి మహేష్, కందుకూరి రాము, దారా చిరంజీవి, మహ్మద్ అబ్దుల్, అజిత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment