పాల్వంచలో మనుధర్మ శాస్త్ర ప్రతులు దహనం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో మనుధర్మ శాస్త్ర పత్రాలను బుధవారం అంబేద్కరిస్టులు దహనం చేశారు.
ఈ సందర్భంగా అంబేద్కరిస్టులు మాట్లాడుతూ "మనువాదులు చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రులను అతి నీచంగా చూడటాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. చరిత్రలో ఈ రోజున (డిసెంబర్ 25) ఆయన మనుస్మృతి ప్రతులను దహనం చేసిన సందర్భంగా పాల్వంచలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బరగడి దేవదానం, శనగ వెంకటేశ్వర్లు, చిటికెన ముసలయ్య, బండి లక్ష్మణ్, దాసరి నాగేశ్వరరావు, వాసుమళ్ల సుందర్ రావు, నాగిరెడ్డి, బండి రామచందర్ రావు, బిల్లా ముత్యం, సతీష్, ప్రసాద్, శనగ రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment