సన్మార్గంలో నడిచేందుకు ఏసుక్రీస్తు బోధనలు దోహదపడతాయి - ఎమ్మెల్యే కూనంనేని

సన్మార్గంలో నడిచేందుకు ఏసుక్రీస్తు బోధనలు దోహదపడతాయి - ఎమ్మెల్యే కూనంనేని

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : సన్మార్గంలో నడిచేందుకు యేసు బోధనలు దోహదపడతాయనీ కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం పాల్వంచలోని ఆర్‌.సి‌.యం. చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవ బోధకులు, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవన గమనం నేటికీ అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. దాతృత్వం, త్యాగం వంటి విలువలు తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని వివరించారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారని అన్నారు. పండగలు, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా, చర్చి ఫాదర్లు పెవెన్సియల్, విజయ్ రావు, క్రీస్తు బాబు, అమృతరావు, సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, డీ. సుధాకర్, నేరెళ్ల రమేష్, శనగారపు శ్రీనివాసరావు, అశోక్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.