ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే బి. కోటేశ్వరరావు ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ వారి కార్యాలయంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి 8,58,320/- రూపాయల చెక్కును అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రతా విభాగం నుంచి ఎక్స్‌గ్రేషియా రూపంలో ఈ నగదును వారికి అందజేయడం జరిగిందని తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు కుటుంబ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉంటూ ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యానారాయణ, ఆర్ఐలు లాల్ బాబు, కృష్ణారావు, జిల్లా కార్యాలయ ఏవో అజ్మీరా మంజ్యా నాయక్, సూపరింటెండెంట్ సత్యవతి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment