రక్తపాతానికి దారితీసిన ప్రేమ కథ.. 15 మందికి జైలు శిక్ష
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : రక్తపాతానికి దారి తీసిన ప్రేమ వివాదం కేసులో 15 మందికి మూడు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు ఇచ్చారు.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి..2014 సెప్టెంబర్ 8న గణేష్ నిమజ్జనం రోజున ఇల్లందు 24 ఏరియాకి చెందిన పులిపాటి లోకేష్ అలియాస్ సాయికుమార్ తన చెల్లెలు ప్రేమిస్తున్న అవినాష్ కు వార్నింగ్ ఇవ్వాలని షేక్ అరీఫ్, నీలమర్రి నాగరాజు, దేవరపల్లి జితేందర్ రెడ్డి, ఏలుగు సుమంత్, తాళ్లపల్లి వంశీ, బండి శ్రీకాంత్, కరకుపల్లి ప్రేమ్ కుమార్, ఎట్టి వెంకటేశ్వర్లు, దడిగల నరేష్, ఎడారి సంపత్, చింతలచెరువు రఘు, కుండోజు రాజు, బోశాల ఉదయ్ కుమార్, సూరపాక గౌతమ్ లను పిలిపించి, అవినాష్ పై ద్వేషం పెంచి, వార్నింగ్ ఇవ్వమని అవినాష్ తన చెల్లెలి ను ప్రేమిస్తున్నాడని చెప్పి వారిని ఉసిగొలిపాడు.
దీంతో వారు ఆగ్రహంగా అవినాష్ వద్దకు వెళ్లి మాట్లాడగా, మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. నీలమర్రి నాగరాజు సహా ఇతరులు కర్రలు, ఆయుధాలు పట్టుకుని అవినాష్ పై దాడి చేశారు. ఈ గొడవలో దండు శ్రీను సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 2015 జూన్ 13న దండు శ్రీను హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.
కేసు విచారణలో 23 మంది సాక్షుల్ని విచారించిన కోర్టు, నిందితులకు శిక్ష విధించింది. షేక్ అరీఫ్, నీలమర్రి నాగరాజు, దేవరపల్లి జితేందర్ రెడ్డి, ఏలుగు సుమంత్, పులిపాటి లోకేష్, తాళ్లపల్లి వంశీ, బండి శ్రీకాంత్, కరకుపల్లి ప్రేమ్ కుమార్, ఎట్టి వెంకటేశ్వర్లు, దడిగల నరేష్, ఎడారి సంపత్, చింతలచెరువు రఘు, కుండోజు రాజు, బోశాల ఉదయ్ కుమార్, సూరపాక గౌతమ్ లకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించగా, ప్రతి ఒక్క నిందితుడికి రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పి.వి.డి.లక్ష్మి వ్యవహరించగా.. నోడల్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, లైజన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు (కోర్టు డ్యూటీ ఆఫీసర్), ఇల్లందు పిఎస్ పిసీ శ్రీనివాసులు సహకరించారు.

Post a Comment