బెండలంపాడు, కనిగిరి గుట్టలను సందర్శించిన రైన్ వాటర్, స్టూడియో పంచతంత్ర బృందాలు

బెండలంపాడు, కనిగిరి గుట్టలను సందర్శించిన రైన్ వాటర్, స్టూడియో పంచతంత్ర బృందాలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం రైన్ వాటర్, స్టూడియో పంచతంత్ర బృందాలు మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారంచండ్రు గొండ మండలం బెండలంపాడు, పాలకోయలొద్ది నుండి దట్టమైన అటవీ ప్రాంతాలలో ట్రెక్కింగ్ నిర్వహించి 1884 అడుగుల ఎత్తులో ఉన్న బల్ల పరుపు వద్ద విశాలమైన ప్రదేశంలో ఉన్న వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన 15 అడుగుల రాతిగోడను పరిశీలించి, కాకతీయుల కాలంలో వాడిన నీటి నిల్వలు, స్నానాల బావులు, వివిధ వస్తువులను పర్యవేక్షించారు.


అంతకు మించి, బెండలంపాడు గ్రామంలో వెదురు ప్లాంటేషన్, అడవులను పరిశీలించి, అక్కడి ప్రకృతి అందాలను కెమెరాల్లో చిత్రీకరించారు. అనంతరం, పూర్వకాలపు హస్తాల వీరస్వామి ఆలయాన్ని సందర్శించి, ఆలయ చరిత్ర మరియు గిరిజనుల సాంస్కృతిక పరిమితులు తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ సీఈవో కల్పన రమేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ మూడు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసిందని తెలిపారు.

Blogger ఆధారితం.