ఆకాంక్షిత జిల్లా అభివృద్ధి లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి - డాక్టర్ ఎంపీ తంగిరియాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఆకాంక్షిత జిల్లా అభివృద్ధి లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలని అడిషనల్ సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఎంపీ తంగిరియాల అన్నారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో నీతి అయోగ్ ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు అధికారులు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
సమీక్ష సమావేశంలో భాగంగా, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకాంక్షిత జిల్లా అభివృద్ధి కోసం వివిధ శాఖలు చేపడుతున్న కార్యక్రమాలను శ్రద్ధగా వివరిస్తూ, బ్యాంకు అధికారులు ఈ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరారు. SIDBI బ్యాంకు, Canara బ్యాంకు, ఇతర బ్యాంకులు MSMEలకు అండగా ఉండాలని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్న పరిశ్రమలు, పశుసంవర్ధన మొదలైన అభివృద్ధి పనులకు సాయం అందించాలని అడిషనల్ సెక్రటరీ కోరారు.
డాక్టర్ తంగిరాల, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ, 100% లక్ష్య సాధన కోసం బ్యాంకులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ, "ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు అర్హులైన వారందరికీ అందించాలి," అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ రెడ్డి, అన్ని బ్యాంకుల అధికారులు, జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment