కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దేవీలాల్ నాయక్

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దేవీలాల్ నాయక్ నియామకం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం పాండురంగపురానికి చెందిన దేవీలాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం నియామక పత్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ డాక్టర్ గూగులోత్ రవి అందజేశారు.


ఈ సందర్భంగా దేవీలాల్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో తన చురుకైన పాత్ర ఫలితంగా ఈ పదవి లభించిందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల తరఫున రాస్తారోకోలు, ధర్నాల్లో పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పదవి తనపై మరింత బాధ్యతను పెంచిందని, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని దేవీలాల్ నాయక్ తెలిపారు.


తన నియామకానికి సహకరించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, పార్లమెంట్ సభ్యులు రఘురామ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పోదేం వీరయ్య, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రవిలకు దేవీలాల్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

Blogger ఆధారితం.