జామా మజీద్ అధ్యక్షుడు ఫయాజ్ సతీమణి మృతి పట్ల సంతాపం తెలిపిన కొత్వాల

జామా మజీద్ అధ్యక్షుడు ఫయాజ్ సతీమణి మృతి పట్ల సంతాపం తెలిపిన కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకుడు, పాల్వంచ నటరాజ్ సెంటర్‌లోని జామా మజీద్ సదర్ మహ్మద్ ఫయాజ్ జుల్ హాసన్ సతీమణి అనారోగ్యంతో మృతి చెందారు.


ఆదివారం పాత పాల్వంచలోని ఫయాజ్ నివాసంలో ఆమె భౌతికకాయానికి రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, ఫయాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు.


ఈ కార్యక్రమంలో పాత పాల్వంచ మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, దారా చిరంజీవి, ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.