న్యూ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు చేయూత

న్యూ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు చేయూత

  • 300 మంది నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ 
  •  లెప్రసి రోగులకు బట్టలు పంపిణీ.
  • పలువురు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేత.
  •  శ్రీనివాస్ కాలనీ క్రీస్తు సంఘం ప్రార్థన మందిరంలో కార్యక్రమం నిర్వహణ

 జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు శ్రమించిన క్రీస్తు సంఘం సేవకులు డాక్టర్ చుక్కా జాకబ్, ఆశీర్వాదమ్మ ఆదర్శ దంపతులని, వారి సేవలు మరవలేనివని న్యూ లైఫ్ సొసైటీ చైర్మన్ సాలి భాస్కర్ అన్నారు. శుక్రవారం పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాస్ కాలనీలో క్రీస్తు సంఘం ప్రార్థన మందిరంలో డాక్టర్ చుక్కా జాకబ్, ఆశీర్వాదమ్మ జ్ఞాపకార్థ కూడిక నిర్వహించారు.


ఈ సందర్భంగా సాలి భాస్కర్ మాట్లాడుతూ "డాక్టర్ చుక్కా జాకబ్, ఆశీర్వాదమ్మ దంపతులు అనేక బాధితులకు జీవిత స్ఫూర్తి నింపారు" అని అన్నారు. అనాధలు, అభాగ్యులకు ఆశ్రయం కల్పించడంతో పాటు క్రీస్తు సిద్ధాంతాలను ప్రజలందరికీ చేరవేసే క్రమంలో వారు తమ జీవితాన్ని అంకితం చేశారు. "వారి త్యాగం, నిస్వార్థ సేవలు సమాజానికి గొప్ప ఆదర్శం" అని కొనియాడారు.


ఆ దంపతుల నేతృత్వంలో సేవా కార్యక్రమాలలు దేశ,విదేశాలలో వ్యాపించింది అని అన్నారు. వారి కృషి ఫలితంగా వేలాది కుటుంబాలు ఆధ్యాత్మికంగా, సామాజికంగా శ్రేయోభివృద్ధి సాధించాయని వివరించారు.


అనంతరం సాలి భాస్కర్ ప్రతి ఏడాది క్రిస్మస్ కానుకగా నిర్వహించే సేవ కార్యక్రమాలలో భాగంగా కుష్టి వ్యాధిగ్రస్తులు, వితంతులు, వృద్ధులు 300 మందికి 18 రకాల నిత్యవసర సరుకుల కిట్ పంపిణీ చేసి, దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు.


ఈ కార్యక్రమంలో బ్రదర్ జాన్ రత్నం, బ్రదర్ వి. సహదేవుడు, బ్రదర్ చుక్కా నవీన్, డాక్టర్ చుక్కా జాకబ్, ఆశీర్వాదమ్మ కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ కాలనీ క్రీస్తు సంఘం సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.