ఎల్లంకి నాగభూషణం మృతి బాధాకరం - ఎమ్మెల్యే కూనంనేని

ఎల్లంకి నాగభూషణం మృతి బాధాకరం - ఎమ్మెల్యే కూనంనేని
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  సీపీఐ సీనియర్ నాయకులు, రైతు సంఘం మాజీ నియోజకవర్గ కార్యదర్శి ఎల్లంకి నాగభూషణం మృతి బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇటీవల నాగభూషణం అనారోగ్యంతో మృతి చెందారు.


శుక్రవారం పాల్వంచ మండలం పేట చెరువులోని నాగభూషణం గృహానికి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇతర నాయకులతో కలిసి వెళ్లి నాగభూషణం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.


ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ, ఎల్లంకి నాగభూషణం లేని లోటు కుటుంబానికే కాకుండా పార్టీకీ తీరని లోటు అని చెప్పారు. పేద గిరిజనుల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించి, పోడు పట్టాలు అందించేందుకు, రైతాంగ సమస్యలపై అనేక సేవలు అందించిన వ్యక్తి నాగభూషణం అని గుర్తుచేశారు. త్యాగదనంతో ఎర్రజెండాని పాల్వంచ ప్రాంతంలో సగర్వంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని, కుటుంబ సభ్యులకు కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.


కూనంనేనితో కలిసి నివాళులర్పించిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, నాయకులు నిమ్మల రాంబాబు, ముత్యాల కిరణ్, ఊకే భద్రయ్య, వాడే లక్ష్మి, అవుల సతీష్, నరేందర్, కనగాల నారాయణ రావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.