2వ రోజు వైభవంగా పవిత్రోత్సవాలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం, కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానంలో (పెద్దమ్మ తల్లి గుడి) దేవాలయ పవిత్రత, భక్తుల సర్వ శ్రేయస్సు కోసం ఈ నెల 25న ప్రారంభమైన పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం రెండవ రోజు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
ఉదయం గణపతి పూజ, కర్మణ పుణ్య వచనం నిర్వహించగా, అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో ప్రత్యేక అర్చన, చండీ హోమం నిర్వహించారు. సాయంత్రం నదినీరాజనం, నీరాజన మంత్ర పుష్పాలు అర్పించి, తీర్థ ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఎన్. రజనీకుమారి, భక్తులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment