తెలుగు ఖ్యాతిని దేశవిదేశాల్లో చాటి చెప్పిన వ్యక్తి పివి - కొత్వాల

తెలుగు ఖ్యాతిని దేశవిదేశాల్లో చాటి చెప్పిన వ్యక్తి పివి - రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : భారత దేశ ప్రధానిగా తెలుగు ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి పి.వి. నరసింహారావు అని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదులు, తెలంగాణా ముద్దు బిడ్డ, భారతరత్న, దివంగత పి.వి. నరసింహారావు 20వ వర్ధంతి సందర్బంగా పాల్వంచ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం పాల్వంచ అయ్యప్పనగర్ లోని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో పి.వి. చిత్ర పటానికి కొత్వాల తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ పి.వి. నరసింహరావు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చి, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారన్నారు. పి.వి. ఆశయాలకనుగుణంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కొత్వాల అన్నారు.


ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి యర్రంశెట్టి ముత్తయ్య, ఎల్. డి.ఏం కో ఆర్డినేటర్ బద్దీ కిషోర్, పట్టణ, మండల యువత కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, మెలిగ మహేష్, నాయకులు చింతా నాగరాజు, కందుకూరి రాము, పులి సత్యనారాయణ, కాపర్తి వెంకటాచారి, హెచ్. మధు, కాపా శ్రీను, ఉండేటి శాంతివర్ధన్, బాషబోయిన అశోక్, మాలోత్ కోటి నాయక్, గంధం నరసింహారావు, కటుకూరి శేఖర్, బలగం కొండల రావు, వెంకట రత్నం, అజిత్, వేణు, దానియేలు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.