టీ.పి.హెచ్.డి.ఎ జిల్లా స్థాయి విస్తృత సమావేశం

 

టీ.పి.హెచ్.డి.ఎ జిల్లా స్థాయి విస్తృత సమావేశం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం యూనిట్ డిస్టిక్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల వివిధ సమస్యలపై చర్చించారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ నాయక్‌కు జిల్లా కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు.


ఈ కార్యక్రమంలో టీ.పి.హెచ్.డి.ఎ యూనిట్ భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాలాజీ నాయక్, జిల్లా జనరల్ సెక్రటరీ డాక్టర్ శివ కుమార్, ట్రెజరర్ డాక్టర్ మురళి కృష్ణ, ఉపాధ్యక్షుడు డాక్టర్ నిశాంత్ రావు, డాక్టర్ ప్రియాంక, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాకేష్, డాక్టర్ మధువరన్, డాక్టర్ సంఘమిత్ర తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.