తెలంగాణా ప్రజల ఆరాధ్య దేవత సోనియా గాంధీ - కొత్వాల

తెలంగాణా ప్రజల ఆరాధ్య దేవత సోనియా గాంధీ - కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :తెలంగాణా రాష్ట్రాన్ని ఆవిర్భవింపజేసిన సోనియా గాంధీని తెలంగాణా ప్రజలు ఆరాధ్య దేవతగా భావిస్తున్నారని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కొత్వాల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

పాల్వంచ అయ్యప్పనగర్ లోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కొత్వాల శ్రీనివాసరావు నేతృత్వంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. సోనియా గాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి, ఆమె చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ "తెలంగాణా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం సోనియా గాంధీ తీసుకున్న ధైర్య నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని" అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేసి, సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని ఆయన కోరారు."

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, బరిపటి వాసుదేవరావు, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు ఎస్.వి.ఆర్.కె.ఆచార్యులు, కాల్వ భాస్కరరావు, బాలినేని నాగేశ్వరరావు, దొప్పలపూడి సురేష్ బాబు, బాలు నాయక్, కాపర్తి వెంకటాచారి, వెంకటేశ్వర్లు, పైడిపల్లి మనోహర్, మాలోత్ కోటి నాయక్, గంగిరెడ్డి భువన సుందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు పైడిపల్లి మహేష్, నల్లమల్ల సత్యం, వాసుమల్ల సుందర్ రావు, ఏలూరు రామారావు, చాంద్ పాషా, డిష్ నాగేశ్వర రావు, ధర్మసోతో ఉపేందర్, బాషా, పులి సత్యనారాయణ, శనగా రామచందర్, పాకలపాటి రోశయ్య చౌదరి, మస్నా శ్రీను, కటుకూరి శేఖర్, అశోక్, బండి నాగరాజు, భూక్య గిరి ప్రసాద్, భుశెట్టి సాంబయ్య, తెల్లం మహేష్, జర్పుల లింగయ్య నాయక్, సుమన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Blogger ఆధారితం.