జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి - న్యాయమూర్తి బత్తుల రామారావు


జె.హెచ్.9. మీడియా,లీగల్ : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కోర్టులో ఈ నెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను  కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బత్తుల రామారావు పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

న్యాయమూర్తి బత్తుల రామారావు మాట్లాడుతూ "జాతీయ లోక్ అదాలత్ రాజీ పడదగ్గ కేసులకు అనువైన వేదిక. కేసుల సత్వర పరిష్కారాల కోసం కక్షిదారులు ఈ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి" అని పేర్కొన్నారు. కేసులు రాజీ చేసుకోవడంలో ఆసక్తి ఉన్నవారు ఈ లోక్ అదాలత్  ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

జాతీయ లోక్ అదాలత్ లో రాజీకి అవకాశం ఉన్న కేసులు:

  • యాక్సిడెంట్ కేసులు
  • సివిల్ కేసులు
  • చీటింగ్ కేసులు
  • చిట్ ఫండ్ కేసులు
  • భూ తగాదాలకు సంబంధించిన కేసులు
  • వివాహ బంధాలకు సంబంధించిన కేసులు
  • చిన్నచిన్న దొంగతనం కేసులు
  • ట్రాఫిక్ చాలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
  • కుటుంబ తగాదాలు
  • బ్యాంకు కేసులు
  • టెలిఫోన్ కేసులు
  • కొట్టుకున్న కేసులు
  • సైబర్ క్రైమ్ కేసులు

Blogger ఆధారితం.