సమావేశానికి అధికారులు సకాలంలో హాజరుకావాలి - కలెక్టర్

సమావేశానికి అధికారులు సకాలంలో హాజరుకావాలి - కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : చ్చే సంవత్సరం జనవరి 9, 10 తేదీలలో జరిగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు కల్పించవలసిన వసతి సౌకర్యాల ముందస్తు ఏర్పాట్లపై మంగళవారం ఉదయం 11:30 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని పురస్కరించుకుని తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు అందించేందుకు సంబంధిత అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.


Blogger ఆధారితం.