అయ్యప్పస్వామి దీక్ష ఎంతో పవిత్రమైనది - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

 

అయ్యప్పస్వామి దీక్ష ఎంతో పవిత్రమైనది - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : అత్యంత నియమ నిష్టలతో 41 రోజులు చేపట్టే అయ్యప్పస్వామి దీక్ష ఎంతో కఠినమైనదనీ, పవిత్రమైనదని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.


ఆదివారం పాల్వంచ అయ్యప్పస్వామి దేవాలయం వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు మేడిద సంతోష్ గౌడ్, మిరియాల కమలాకర్, బండి లక్ష్మణ్ ల ఇరుముడి కార్యక్రమం సందర్భంగా కొత్వాల పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ, తెల్లవారుఝామున సూర్యోదయానికి ముందే లేచి, చన్నీటి స్నానమాచరించడంతో రోజంతా ఆహ్లాదంగా ఉంటుందని అన్నారు. ఒక్క పుట భోజనంతో ఆరోగ్యం బాగా ఉంటుందని, అయ్యప్పస్వామి దీక్షతో సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని కొత్వాల అన్నారు.


పాల్వంచ మార్కెట్ లో మహాపడిపూజలో పాల్గొన్న కొత్వాల దంపతులు


శనివారం రాత్రి పాల్వంచ శాస్త్రి రోడ్ లోని వ్యాపారస్తులు గూడెపు లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్పస్వామి పడిపూజలో కొత్వాల, సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని పూజలు చేశారు. దేవాలయం పూజారి మాధవన్ నంబూద్రి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వాములను శాలువాలతో ఘనంగా సన్మానించారు.


ఈ కార్యక్రమాల్లో మాజీ జడ్పిటిసి బరిపటి వాసుదేవరావు, ఎస్బీ 2 ఇన్స్పెక్టర్ చెన్నూరి శ్రీనివాస్, బందెల శ్రీనివాస్, కనగాల రాంబాబు, మేడిద సంతోష్ గౌడ్, మిరియాల కమలాకర్, బండి లక్ష్మణ్, అక్కపాక శంకర్ మని, రాజలింగం, చారి, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, పైడిపల్లి మహేష్, ఉండేటి శాంతివర్ధన్, మాలోత్ కోటి నాయక్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.