శతాధిక వృద్ధుడు పీర్ సాహెబ్ కు నివాళుర్పించిన డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాత పాల్వంచకు చెందిన శతాధిక వృద్ధులు షేక్ పీర్ సాహెబ్ (101) మృతి చెందారు. ఆదివారం పాత పాల్వంచ బొడ్రాయి బజార్ లోని ఆయన స్వగృహంలో, ఆయన భౌతికకాయానికి రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు నివాళుర్పించారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో షేక్ అజ్మత్ అలీ, షేక్ యాకుబ్, షేక్ యాకుబ్ అలీ, షేక్ ఖాసీం, షేక్ నాగుల్ మీరా, షేక్ ముజాహిద్, పుప్పాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Post a Comment